ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2014లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చిన్మయి తాను గర్భవతి విషయాన్ని అభిమానులతో గతంలో పంచుకుంది. అంతేకాకుండా ప్రెగ్నేన్సీ సమయంలోని బేబీ బంప్‌తో ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. అయితే.. గత రాత్రి చిన్మయి కవలలకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా కవలల పేర్లు ద్రిప్తా, శర్వాస్‌గా ఆయన తెలిపారు. దీంతో చిన్మయి-రాహుల్ రవీంద్రన్‌లకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
నటి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన చిన్మయి తెలుగులో పలు పాటలు పాడారు. రాహుల్ రవీంద్రన్ హీరోగానే కాకుండా సహాయనటుడిగా ఎన్నో మంచి పాత్రలు పోషించారు. ఇటీవల న్యాచురల్ స్టార్ నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమాలో రాహుల్ రవీంద్రన్ పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. నటుడిగానే కాకుండా రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు.