NTV Telugu Site icon

Devara: దేవర – తంగలాన్ సినిమాల మధ్య పోలిక .. ఏంటో తెలుసా?

Tangalan Dveva

Tangalan Dveva

Similarities between Thangalaan and Devara: కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన విక్రమ్ తంగలాన్ సినిమాకి నేడు రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి ఒక పోలిక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేవర సినిమాలో హీరోయిన్ పేరు తంగం, కాబట్టి తంగలాన్ కి దేవరకి పోలిక తంగంఅని అనుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే తంగలాన్ సినిమా ఒక పీరియాడిక్ సినిమా. ఈ సినిమాలో ఒక అటవీ జాతికి చెందిన తెగ ప్రజలు స్వాతంత్రానికి ముందు రాజుల వద్ద బంగారం వెలికి తీసే పనిలో ఉండేవారు. బ్రిటిష్ వాళ్లు ఇండియాను ఆక్రమించాక వాళ్ళకి పని చేసే వాళ్ళు తర్వాత వాళ్ల నుంచి విముక్తి పొందినట్టు చూపించారు. అంటే ఒక రకంగా ఎంతో హిస్టరీ ఉన్నట్టుగా చూపించారు. ఇక దేవర సినిమాలో కూడా దాదాపుగా అదే ఫాలో అయ్యారు. నాలుగు గ్రామాలను కలిపి ఎర్ర సముద్రంగా పిలుస్తూ ఉండేవారు.

IPS Story: రూ.50 లక్షల ఫారిన్ ఉద్యోగం వదిలేసి.. ఎస్పీగా మారిన సంతోష్ కథ..

ఆ నాలుగు గ్రామాల ప్రజలు రాజుల కాలం నుంచే సముద్రానికి కావాలి కాస్తూ ఉండేవారు. తరువాత బ్రిటిష్ వాళ్ళు సొమ్ములు తీసుకుని పారిపోతుండగా వారి మీద దాడి చేసి సొమ్ములను మళ్ళీ భారతదేశానికి చేర్చేవారు. ఇక ఆ తరువాత తమ అవసరానికి అనుగుణంగా మారినట్లు చూపించారు ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలకు పోలిక అదేనని చెప్పవచ్చు.ఈ రెండు సినిమాల్లోనూ హీరో పూర్వీకులు బ్రిటిష్ కాలం ముందు నుంచి ఉన్న ఓ జాతి ..తర్వాత కాలంలో బతుకు తెరువుకు పడే పాట్లను చూపారు. అలాగే హీరో వారిలో ఒకరై..లీడర్ కావటం, బ్రిటిష్ కాలానికి పూర్వం రాజుల నుంచి మొదలై ఆ తర్వాత ఇప్పటివరకు కొనసాగుతున్నట్లుగా చూపించడం కామన్ పాయింట్స్ అనుకోవచ్చు.

Show comments