సింగిల్ టేక్ లో శింబు సిక్స్ మినిట్స్ షాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోగా కంటే వివాదాలతోనే ఎక్కువగా పేరు సంపాదించాడు తమిళ నటుడు శింబు. ప్రత్యేకించి ప్రేమ వ్యవహారాలకు ఇతగాడు పెట్టింది పేరు. అందుకే కెరీర్ లో వెనకబడ్డాడు శింబు. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ సినిమాలో నటిస్తున్నాడు శింబు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో శింబుకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాచి తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో శింబు ముస్లిం యువకుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఆరు నిమిషాల నిడివి ఉన్న ఓ షాట్ ను సింగిల్ టేక్ లో చేసి శెహభాష్ అనిపించుకున్నాడు శింబు. ఈ షాట్ లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్సన్ తోపాటు ఎస్.జె.సూర్య కూడా పాల్గొన్నారు. భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య వంటి దర్శకులు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
Also Read
- Esther Anil : మోహన్ లాల్'ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
- Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
- Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
- Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. 'స్పిరిట్' డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
తాజావార్తలు
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!