Site icon NTV Telugu

Silk Smitha : రాత్రైతే చాలు.. సిల్క్ స్మిత బెడ్‌పై అలా.. సీక్రెట్ బయటపెట్టిన డిస్కో శాంతి

Silk Smitha (2)

Silk Smitha (2)

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ సిల్క్ స్మిత. బాల్యానికి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎన్నో తీరని కష్టాలను ఎదుర్కొన్న ఆమె, సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. అలనాటి హీరోయిన్ అపర్ణకు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సిల్క్..

Also Read : Susmitha : ప్రతి 8 గంటలకోసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిందే .. లేకపోతే బ్రతకలేను

అనుకోకుండా నటనకు అవకాశం దక్కించుకున్న స్మితా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, తన డెడికేషన్‌తో తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. ఆమె నటన, డ్యాన్సులు, బోల్డ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. అంతగా పాపులర్ అయిన స్మితా, ఒక్క రోజుకే లక్ష రూపాయల పారితోషికాన్ని అందుకుంటూ, దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక రికార్డు స్థాయికి ఎదిగింది. ఆమె చిత్రాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉండేది. 80, 90వ దశకాల్లో హీరోయిన్‌గా కాకపోయినా, ఒక స్టార్ స్టేటస్ ఆమెకు దక్కింది. అయితే ఇటీవల సీనియర్ నటి, డ్యాన్సర్ డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో స్మిత గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.

‘నేను స్మిత తో ఎంతో సన్నిహితంగా ఉండేదాన్ని, స్మిత తన వ్యక్తిగత విషయాలను నాతో పంచుకుంటుంది. అయితే ఒక సారి స్మిత తన సంపాదన గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఆమె సంపాదించిన డబ్బును రాత్రి సమయంలో బెడ్‌పై పరచి, కరెన్సీ నోట్లపై నిద్రపోయేదట. ఈ మాటను స్వయంగా స్మితా చెప్పింది’ అంటూ డిస్కో శాంతి వెల్లడించారు. ఇక ఈ మాటలు విన్న సిల్క్ తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version