NTV Telugu Site icon

Silk Smitha Special : “మూతపడిన మత్తు కళ్ళు”..

Untitled Design (9)

Untitled Design (9)

విజయలక్ష్మి వడ్లపాటి ఈ పేరు అంతగా తెలియక పోవచ్చు కానీ సిల్క్ స్మిత అనే పేరు తెలియని వారు ఉండరు, 90స్ లో సిల్క్ స్మిత ఐటం సాంగ్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. వెండితెరపై సిల్క్ కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఉగిపోయేవారు. మత్తెక్కించే కళ్ళతో, చిక్కటి చిరునవ్వుతో, నాజూకు అందాలతో కుర్రకారును తన డాన్స్ లతో విజిల్స్ కొట్టించింది సిల్క్. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. సినిమాల్లో ఎప్పుడు నవ్వుతు కనిపించే సిల్క్ జీవితంలో కన్నీరే ఎక్కువ. నమ్మిన వారి చేతిలో మోసపోయి అతి చిన్న వయసులో జీవితాన్ని అర్దాంతరంగా ముగించింది విజయలక్ష్మి.

సినీ పరిచయం : 

స్మిత ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో 2 డిసెంబర్ 1960లో జన్మించింది సిల్క్ స్మిత. చిన్న వయస్సులో పెళ్లి, భర్త, అత్తమామలు వేధింపులు పడలేక ఇంటి నుండి పారిపోయి మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది. సినిమాల మీద పిచ్చితో ఎప్పటికైనా హీరోయిన్ అవాలని కళలు కనింది. సినీ నటి అపర్ణకు టచ్-అప్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ ను ప్రారంభించింది సిల్క్. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్ తన “ఇనాయే తేడి” చిత్రంలో సిల్క్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు. కానీ ఆ సినిమా చాలా కాలం దాక  విడుదల కాలేదు.ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు ఈస్ట్‌మన్ విజయలక్ష్మి పేరును కాస్త స్మిత గా మార్చాడు. తమిళ నటుడు దర్శకుడు, విను చక్రవర్తి స్మితకు కెరీర్ తొలినాళ్లలో సాయం చేసాడు. విను చక్రవర్తి రైటర్ గా విజయన్ దర్శకత్వంలో 1979లో వచ్చిన (వండి చక్రం) బండి చక్రం సినిమాలో తొలిసారిగా సిల్క్ స్క్రీన్ పై కనిపించింది. ఈ సినెమాలోని తన పాత్ర పేరైన సిల్క్ ను ఇంటిపేరుగా మార్చుకుని స్మిత కాస్త సిల్క్ స్మిత గా మార్చుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ తో సిల్క్ కు అన్ని వ్యాంప్ పాత్రలు, ఐటం సాంగ్స్ వచ్చాయి.

సిల్క్ పాట ఉంది అంటే చాలు థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యేవి. కొందరు సినీ విమర్శకులు సిల్క్ ను ‘సాఫ్ట్ పోర్న్’ నటిగా విమర్శించారు. కానీ అవేమి పట్టించుకోకుండా వచ్చిన ప్రతి సినిమాలో నటించింది సిల్క్ స్మిత. ఒకానొక టైమ్ లో అప్పటివరకు రిలీజ్ కాలేక ల్యాబ్ లో మూలాన పడిన సినిమాలను కూడా బయటకు తీసి సిల్క్ స్మిత పై ఐటం సాంగ్ తీసి జత చేసి విడుదళ చేసి సొమ్ము చేసుకున్నారు నిర్మాతలు. 17 ఏళ్ళ సినీ కెరీర్ లో తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో 500 లకు వైగా చిత్రాల్లో నటించింది. కమల్ హాసన్, రజనీ కాంత్ వంటి ఎందరో స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో సిల్క్ పాట తప్పనిసరి గా ఉండేలా చూసుకునేవారు అంటే అర్ధం చేసుకోవచ్చు సిల్క్ హావా ఎలా కొనసాగిందో.

చివరి దశ :

సిల్క్ స్మిత ఎప్పుడు ముక్కు సూటిగా ఉండేది. అది కొందరు అహంకారంగా భావించి వారు. సినీ కెరీర్ లో పీక్ లో ఉన్నపుడు ఓ స్టార్ హీరో ప్రేమలో మోసపోయింది సిల్క్. ఆ భాదను తట్టుకోలేక ఎక్కువగా మద్యం సేవించేది. 1996  సెప్టెంబరు 23 రాత్రి, కన్నడ సినిమా షూటింగ్ తర్వాత హోటల్ కు చేరుకొని తన స్నేహితురాలు నటి అనురాధ కు కాల్ చేసి తన భాదను చెప్పుకుని, అదేరోజు తన హోటల్ గదిలో ఉరివేసుకుని చనిపోయింది. స్మిత శరీరంలో అధికంగా మద్యం ట్రేసెస్ దొరకడం వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. పోలీసులు ఆమె గదిలో ఒక సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికి ఆమె మరణం అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది.  వెండితెరపై తన డాన్స్ లతో ఎందరికో నిద్ర లేకుండా చేసిన  మత్తుకళ్లు శాశ్వతంగా నిద్రపోయాయి.

Show comments