Site icon NTV Telugu

Salman Khan : బాలీవుడ్ నుంచి నా కూడా మద్దతు కావాలి..

Salmankhan (2)

Salmankhan (2)

ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటినటలు మధ్య మంచి సపోర్ట్ మాత్రం ఉండాలి. కానీ పోటి పడతారే తప్ప సపోర్ట్ చేసుకోవడం చాలా తక్కువ. ఇదే విషయం పై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ స్పందించాడు. ప్రజంట్ బాలీవుడ్ పరిస్ధితి ఎలా ఉందో మనకు తెలిసిందే. హిట్ కొట్టడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే తాజాగా సల్మాన్ ‘సికందర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా విడుదలయ్యాక.. బాలీవుడ్ నటీనటులు ఎవ్వరు కూడా ఈ మూవీ గురించి మాట్లాడలేదు. సల్మాన్ తన తోటి స్టార్స్ సినిమా ప్రచారాల్లోనూ పాల్గొనప్పటికీ..

Also Read: Kantara prequel : ‘కాంతార’ ప్రీక్వెల్ రిలీజ్ పై క్లారిటి..?

‘సికందర్’ పై మిగిలిన వారేవరూ మాట్లాడలేదు. తాజాగా వీరి మౌనంపై సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘బాలీవుడ్‌ వారంతా నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అనుకున్నారేమో.. అందుకే ఎవరూ స్పందించలేదు. కానీ ప్రతి మనిషికి మద్దతు కావాలి. అలాగే నాకూ సపోర్ట్ కావాలి. ‘సికందర్’ విడుదలకు ముందు ఆమిర్ ఖాన్, సన్నిహితులు మాత్రమే నా సినిమాపై పోస్ట్‌లు పెట్టారు. సినిమా విజయం సాధించాలని కోరుతూ సన్నీదేవోల్ కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. రిలీజ్ కు ముందు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో కలిసి ఆమిర్బాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరూ మినహా బాలీవుడ్ స్టార్స్ ఎవరూ దీన్ని ప్రమోట్ చేయలేదు. మనల్ని మనం సపోర్ట్ చేసుకోపోతే ఎలా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Exit mobile version