Sigma OTT Release Date: తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు సంజయ్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సిగ్మా’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఆశించిన స్థాయిలో ఆదరణను సొంతం చేసుకోలేకపోయింది. సిగ్మా మూవీ 30 కోట్ల బడ్జెట్‌తో తెరక్కేక్కినట్లు సమాచారం.
తాజాగా సిగ్మా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఇంట్లోనే వీక్షించే అవకాశం లభించనుంది. కొత్త డైరెక్టర్ అయినా మన తెలుగు నటులు సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా నటించడంతో.. సినిమాపై విడుదలకు ముందు ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే థియేటర్లలో మాత్రం ఆశించిన స్పందన లభించలేదు. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

