Site icon NTV Telugu

“సిగ్గు ఎందుకురా మామ” అంటున్న సుకుమార్

Siggendukura Mama Song will be released by Sukumar

‘రాజావారు రాణీగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో తండ్రిగా సాయికుమార్ నటించగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. “చూశాలే కళ్ళారా, చుక్కల చున్నీతో” సాంగ్స్ అయితే యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. టీజర్ కు కూడా మంచి స్పందనే వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

Read Also : “బాహుబలి” ఆఫర్ ను వదులుకున్న సామ్ ?

“సిగ్గు ఎందుకురా మామ” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రేపు ఉదయం 10 గంటలకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో త్వరలోనే సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాలు ప్రమోషన్లను స్టార్ట్ చేస్తున్నాయి. ఇక సాంగ్స్ తో ఆసక్తిని పెంచేసిన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘సెబాస్టియన్ పి.సి. 524’, ‘సమ్మతమే’ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా మరో రెండు సినిమాలను కిరణ్‌ అబ్బవరం లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది.

Exit mobile version