శంతను హజారికా … ఎవరతను అంటారా? శ్రుతీ హసన్ బాయ్ ఫ్రెండ్! ఆ మధ్య ఓ ఫారిన్ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపి కొన్నాళ్లు లండన్ లోనే ఉండిపోయిన మిస్ హసన్ బ్రేకప్ తరువాత ఇండియాకొచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ మీద దృష్టి పెట్టింది. కానీ, ఎక్కువ రోజులు ఆమె మనసు ఆమె వద్దే ఉండలేదు. కొన్నాళ్లకే మరో ప్రియుడి చెంతకు చేరిపోయింది. అతనే శ్రుతీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా!
శంతను మంచి ఆర్టిస్ట్. అతడి పెయింటింగ్స్ కు ఇప్పటికే మంచి పాప్యులారిటీ ఉంది. అయితే, ఇప్పుడు ప్రియురాలిగా శ్రుతీ కూడా తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తోంది. అందగాడి అందమైన పెయింటింగ్స్ అందాల రాశి ప్రమోట్ చేస్తోంది. 16 మిలియన్ ఫాలోయర్స్ కంటే ఎక్కువ మంది శ్రుతీ హసన్ ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నారు. వారందరికీ శంతను హజారికా టాలెంట్ పరిచయం చేయాలని డిసైడ్ అయింది లేడీ హసన్. అందుకే, ఆయన ఆవిష్కరించిన చూడ ముచ్చటైన కళాఖండాల నడుమ తాను మరో కళాకృతిలో ఇమిడిపోయింది! బ్యూటిఫుల్ పెయింటింగ్స్ నడుమ హొయలుపోయిన హాట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో తన సరికొత్త ఫోటోలు పోస్ట్ చేసింది…
కమల్ హాసన్ లాంటి లెజెండ్ కి కూతురైనా శ్రుతీ టీనేజ్ నుంచే సెల్ఫ్ మేడ్ ఉమన్! అలా తాను సంపాదించిన డబ్బులతోనే ఈ మధ్య ముంబైలో ఓ అపార్ట్ మెంట్ ఖరీదు చేసింది. దాంట్లోనే ప్రస్తుతం, తన ఆర్టిస్ట్ బాయ్ ఫ్రెండ్ తో అందాల శ్రుతీ కాపురముంటోంది. మరైతే పెళ్లెప్పుడనేది మాత్రం, రైట్ నౌ, మిలియన్ డాలర్ క్వశ్చనే!