Site icon NTV Telugu

Shruti Haasan: సొంతంగా పైకి వచ్చాను.. వాళ్లు రికమెండ్ చేయలేదు..

Sruthi Hasan

Sruthi Hasan

Shruti Haasan: శ్రుతి హాసన్‌ అంటేనే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గబ్బర్‌ సింగ్‌ సినిమానే. శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అమ్మడు. శ్రుతి అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా.. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత శ్రుతిహాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. శ్రుతి చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ లు అవుతున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ సినిమాతో శ్రుతిహాసన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంది. అయితే తాజా ఓ ఛాన్‌కు ఇంటర్వూ ఇచ్చింది ఈ అమ్మడు. తాను సొంతంగా పైకి వచ్చానని, ఇండస్ట్రీలో అవకాశాల కోసం అమ్మ, నాన్న ఎవరికీ ఫోన్ చేసి రికమెండ్ చేయలేదని హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపింది.

read also: PM Modi: ఇది ఎమోషనల్ మూమెంట్.. వెంకయ్య సాక్షిగా సభలో అనేక చారిత్రక ఘటనలు..

తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇండస్ట్రీలో ఎంట్రీ మాత్రమే ఇవ్వగలదని, నిరూపించుకోవాల్సింది మాత్రం తానేనని పేర్కొంది. మనం పడే కష్టం కెరీర్కు ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతానని, ఛాలెంజ్ లేకపోతే జీవితంలో ముందుకు సాగలేమని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. ఓ ఛానల్‌ ఇంటర్వూలో శ్రుతి హాసన్ ఈ వాఖ్యలు చేసారు. ఇక టాలీవుడ్‌ హీరోల గురించి మాట్లాడిన శ్రుతి గబ్బర్ సింగ్ ముందు వరకు తనని తెలుగులో ఐరన్ లెగ్ అని పిలిచేవారని పేర్కింది. అయినా ధైర్యం చేసి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ నాకు అవకాశం ఇవ్వడంతో.. నా బండి యూటర్న్ తీసుకుందని, ఆయన నాకు చాలా లక్కీ అంటూ తెలిపారు. బన్నీ, చరణ్‌ గురించి భారతదేశంలో అందరూ పొగుడుతుంటే ఇది మనకి ఎప్పుడో తెలుసు కదా అనిపిస్తుందని శ్రుతి చెప్పొకొచ్చింది. ప్రభాస్ అంటే చాలా ఇష్టం, తను నిజంగా డార్లింగ్‌ ఏ.. అంటూ తెలిపింది. ఇక నాగచైతన్య తో పని చేసినందుకు ఎంతో సంతోష పడుతున్నాను. మేం ఎప్పుడో ప్రేమమ్ సినిమా చేశామని శ్రుతి చెప్పుకొచ్చారు.

అయితే శ్రుతి గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి చివరకు అతడికి బ్రేకప్ చెప్పింది. దీంతో ఆసమయంలో సినిమాలు కూడా తగ్గించి, కొద్ది రోజులు డిప్రషన్ లోకి కూడా వెళ్ళింది. అనంతరం ఎంతో దైర్యంగా డిప్రషన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తూ పూర్తిగా మాములు స్థితికి వచ్చేసింది. ఇటీవ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన అందరిని ఆకట్టుకుంది శ్రుతి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ప్రభాస్ సరసన సలార్, నందమూరి బాలకృష్ణ సరసన ఎన్బీకే 107 లో నటిస్తోంది. ఇక ఈ రెండు కాకుండా చిరు సరసన మెగా 154 లో కూడా ఛాన్స్ కొట్టేసింది.
Buddha Venkanna: వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి

Exit mobile version