ఒకప్పుడు పబ్లిక్ కంట పడకుండా జాగ్రత్త పడే సినీ సెలెబ్రిటీల ప్రేమజంటలు ఇప్పుడు బాహాటంగానే హద్దులు మీరిపోతున్నారు. తాజాగా కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ తన ప్రియుడు శంతను హజారికతో చేసిన సందడి వైరల్ అవుతోంది. ప్రియుడితోనే ముంబైలో ఉంటున్న శ్రుతి హాసన్ పబ్లిక్‌గా రెచ్చిపోయింది. ఓ సూపర్ మార్కెట్‌లో శ్రుతి హాసన్ చేసిన ముద్దుల రచ్చ ఇప్పుడు వైరల్ అవుతోంది. వీకెండ్ సందర్భంగా ఈ రచ్చను శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసింది. దీంతో శ్రుతి హాసన్ అందరి ముందు చేసిన రొమాన్స్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ జంట ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో నటిస్తోంది.
పబ్లిక్‌లో శృతిమించిన.. శ్రుతి హాసన్ ముద్దులు!
