Sruthihasson : నా స్టార్‌డమ్‌కి కారణం తెలుగు ప్రేక్షకులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్, బాలీవుడ్ రెండింట్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. లోకనాయకుడు కూతురు అయినప్పటికి, ఎక్కడ కూడా తండ్రి పేరు వాడుకోకుండా తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. సింగర్‌గా కూడా తనలోని కొత్త కోణాన్ని చూపించింది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ తన కెరీర్‌కు ఎంత పెద్ద మలుపు తీసుకువచ్చిందో గుర్తు చేసుకుంది.
Also Read : Toxic : యశ్ ‘టాక్సిక్’లో.. మరో హీరోయిన్ సర్ప్రైజ్ ఎంట్రీ
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
శ్రుతి మాట్లాడుతూ – “నా కెరీర్ ప్రారంభంలోనే మూడు చిత్ర పరిశ్రమలో (తెలుగు, తమిళం, హిందీ) ఒక దారిని వెతుక్కుంటూ పోయాను. కానీ నాను తొలిసారి ఒక నటిగా గుర్తించింది మాత్రం తెలుగు సినిమా పరిశ్రమే. అది నాకు ఆర్థికంగా లాభదాయకమే కాకుండా, ఒక నటిగా ఎదగడానికి అవసరమైన స్వేచ్ఛను, అవకాశాన్ని ఇచ్చింది. స్టార్డమ్ అనేది ఒక కళంకం కాదు, అది మనకు శక్తిని ఇస్తుంది. ఈ రోజు నేను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి తెలుగు ప్రేక్షకుల మద్దతే కారణం” అని చెప్పింది.
ఆమె చెప్పినట్లుగానే తెలుగులో శ్రుతి చేసిన సినిమాలు ఆమె కెరీర్‌ను మలుపుతిప్పినట్లు చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్ ఆమెకు మొదటి బ్లాక్‌బస్టర్ ఇచ్చింది. ఆ తర్వాత బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్, క్రాక్, వకీల్ సాబ్, వీర సింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య, సాలార్ వంటి వరుస సూపర్‌హిట్స్ ఆమె ఖాతాలో చేరాయి. ప్రతి సినిమాలోనూ విభిన్నమైన పాత్రలతో మెప్పించిన శ్రుతి, టాలీవుడ్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కూలీలో, కూడా కనిపించిన ఆమె, ప్రస్తుతం మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. మొత్తానికి, శ్రుతి హాసన్‌కి తెలుగు సినీ పరిశ్రమ కేవలం కెరీర్ ప్రారంభం మాత్రమే కాకుండా, స్టార్డమ్ కూడా అందించింది అని చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!