Site icon NTV Telugu

Sruthihasson : నా స్టార్‌డమ్‌కి కారణం తెలుగు ప్రేక్షకులే..

Sruthihasson

Sruthihasson

సౌత్‌, బాలీవుడ్‌ రెండింట్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. లోకనాయకుడు కూతురు అయినప్పటికి, ఎక్కడ కూడా తండ్రి పేరు వాడుకోకుండా తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుం‌ది. సింగర్‌గా కూడా తనలోని కొత్త కోణాన్ని చూపించింది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ తన కెరీర్‌కు ఎంత పెద్ద మలుపు తీసుకువచ్చిం‌దో గుర్తు చేసుకుంది.

Also Read : Toxic : యశ్ ‘టాక్సిక్’‌లో.. మరో హీరోయిన్ సర్ప్రైజ్ ఎంట్రీ

శ్రుతి మాట్లాడుతూ – “నా కెరీర్ ప్రారంభంలో‌నే మూడు చిత్ర పరిశ్రమలో (తెలుగు, తమిళం, హిందీ) ఒక దారిని వెతుక్కుంటూ పోయాను. కానీ నాను తొలిసారి ఒక నటిగా గుర్తించింది మాత్రం తెలుగు సినిమా పరిశ్రమే. అది నాకు ఆర్థికంగా లాభదాయకమే కాకుండా, ఒక నటిగా ఎదగడానికి అవసరమైన స్వేచ్ఛను, అవకాశాన్ని ఇచ్చింది. స్టార్‌డమ్ అనేది ఒక కళంకం కాదు, అది మనకు శక్తిని ఇస్తుంది. ఈ రోజు నేను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి తెలుగు ప్రేక్షకుల మద్దతే కారణం” అని చెప్పింది.

ఆమె చెప్పినట్లుగానే తెలుగులో శ్రుతి చేసిన సినిమాలు ఆమె కెరీర్‌ను మలుపుతిప్పినట్లు చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్ ఆమెకు మొదటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చింది. ఆ తర్వాత బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్, క్రాక్, వకీల్ సాబ్, వీర సింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య, సాలార్ వంటి వరుస సూపర్‌హిట్స్ ఆమె ఖాతాలో చేరాయి. ప్రతి సినిమాలోనూ విభిన్నమైన పాత్రలతో మెప్పించిన శ్రుతి, టాలీవుడ్‌లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కూలీ‌లో, కూడా కనిపించిన ఆమె, ప్రస్తుతం మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. మొత్తానికి, శ్రుతి హాసన్‌కి తెలుగు సినీ పరిశ్రమ కేవలం కెరీర్ ప్రారంభం మాత్రమే కాకుండా, స్టార్‌డమ్‌ కూడా అందించింది అని చెప్పుకోవచ్చు.

Exit mobile version