గర్భధారణ నుంచి కుమార్తె పుట్టుక వరకూ దాదాపు ఒకటిన్నర సంవత్సరం రహస్యంగా ఉంచిన శ్రియా శరన్ తన కుమార్తెను పరిచయం చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక శ్రియ ఆమె భర్త ఆండ్రీ తమ కూతురుకు ‘రాధ’ అని పేరు పెట్టారు. అయితే ఆ పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది శ్రియ. అమ్మకు అమ్మాయి పుట్టింది అని చెప్పిన క్షణంలో ఆమె ‘ఓ… రాధా రాణి వస్తోంది’ అనేసింది. అప్పుడు ఆండ్రీ మీ అమ్మ చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అంతే కాదు ఎందుకు మా అమ్మ పుట్టిన బిడ్డను రష్యన్ పేరుతో ఎందుకు పిలుస్తోందని అడిగాడు.
అదేంటి అన్నప్పుడు ‘రాధా’ అంటే రష్యన్‌లో సంతోషం అని వివరించాడు. అంతే ఇక తన పేరు రాధ అని ఫిక్స్ అయ్యాం. సో మా అమ్మాయి పూర్తి పేరు రాధా శరన్ కొచ్చీవ్ అని చెబుతోంది శ్రియ. తనకు సుఖ ప్రసవం జరిగిందని, రాధ పుట్టినప్పుడు మా అమ్మ తనతోనే ఉందని శ్రియ చెబుతోంది. పాప పుట్టిన తర్వాత చాలా పని ఉంటుందని, పిల్లలను పెంచటం చాలా కష్టమైన పని అయినా చాలా సరదాగా ఉంటుంది. ప్రతి రోజు నా గురించి నేను ఎంతో నేర్చుకున్నా. పాప డెలివరీ తర్వాత పిల్లలను పెంచే తల్లిదండ్రులపై నాకు మరింత గౌరవం పెరిగిందని అంటోంది శ్రియ. ప్రస్తుతం శ్రియ శర్మాన్ జోషితో కలసి ‘మ్యూజిక్ స్కూల్’ సినిమాలో నటిస్తోంది. ఇక ఆమె నటించిన ‘దృశ్యం2, ఆర్.ఆర్.ఆర్, గమనం, నరగాసురన్’ సినిమాలు విడుదల కావలసి ఉంది.
