Site icon NTV Telugu

Pahalgam Attack : వరుసపెట్టి క్యాన్సల్ అవుతున్నా ప్రముఖుల షోలు..

Sreyagoshal, Anirudh

Sreyagoshal, Anirudh

రీసెంట్‌‌గా జమ్ము కశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్‌లో ఉగ్రవాదులు కృరంగా కాల్పులు  జరిపిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా  28 మంది అమాయకులు ప్రాణాలు తీశారు. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేసింది. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇక ఉగ్రదాడి అనంత‌రం దేశంలో ప‌రిస్థితులు ఉత్కంఠగా మారాయి. ఇప్పటికే పలు న‌గ‌రాల్లో భ‌ద్రత‌ను క‌ట్టుదిట్టం చేశారు. అయితే దేశ‌వ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ ఉండ‌డంతో, ప‌లువురు సినీ ప్రముఖులు త‌మ షోల‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే సింగ‌ర్‌ అర్జిత్‌ సింగ్‌ ఏప్రిల్‌ 27న చెన్నైలో జరగాల్సిన తన షో ను రద్దు చేసుకోగా.. ఇందులో భాగంగా తాజాగా సింగ‌ర్ శ్రేయాఘోషల్ కూడా త‌న కన్సర్ట్‌ను ర‌ద్దుచేసుకుంది.

Also Read : Sri vishnu : శ్రీవిష్ణు ‘సింగిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘ఆల్ హార్ట్స్ టూర్’ అనే పేరుతో శ్రేయ ఘోషల్ దేశ విదేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే నేడు గుజ‌రాత్‌లోని సూర‌త్ వేదిక‌గా ఆమె మ్యూజిక్ క‌న్సర్ట్ జరగాల్సి ఉండ‌గా.. తాజాగా ఈ క‌న్సర్ట్‌ను క్యాన్సిల్ చేసుకున్నామ‌ని ప్రక‌టించింది. ఇప్పటికే షో కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆమె చెన్నై, కోయంబత్తూరు ప్రదర్శనలు ఇవ్వగా ఈరోజు సూరత్‌లో జరగాల్సిన ఈ కార్యక్రమం రద్దయింది. మరోవైపు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ‘హుకుమ్’ పేరుతో ప్రపంచ టూర్‌ చేస్తున్నారు. మే 31న బెంగళూరులో జరగనున్న ఆయన కాన్సర్ట్ టికెట్లు గంటలోనే అమ్ముడయ్యాట. ప్రేక్షకుల ఆదరణతో జూన్ 1న కూడా కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ ఉగ్రదాడి కారణంగా రెండో రోజు టికెట్ల అమ్మకాలు వాయిదా పడ్డాయి. మరో కొత్త డేట్ త్వరలో ప్రకటించనున్నారట.

Exit mobile version