Shraddha Srinath : ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘డాకు మహారాజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు తాజాగా సైన్స్ ఫిక్సన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ‘కలియుగమ్ 2064’ తో రాబోతుంది. కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఆర్.కె.ఇంటర్నేషనల్ సంస్థపై కె.ఎస్. రామకృష్ణ నిర్మించగా, యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రం గా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మే 9న తమిళ,తెలుగు భాషల్లో ఏకకాలంలో సమ్మర్ కానుకగా విడుదల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని టాప్ బ్యానర్ అయిన ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్’ సంస్థ విడుదల చేస్తుంది. ఇక తాజాగా సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు..
Also Read:KA : ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో కిరణ్ అబ్బవరం మూవీ
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
ఇక ట్రైలర్ లాంచ్ అనంతరం దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘ ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిజంగా ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఫోటోగ్రఫి, క్యారెక్టర్స్ డిజైన్. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్.. ఇలా అన్నీ ఒక మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ చదివిన ఫీలింగ్ ఇచ్చాయి. మే 9న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. మూవీ యూనిట్‌కి నా బెస్ట్’ అంటూ తెలిపారు.
ఇక ఈ ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ విషయానికి వస్తే.. భవిష్యత్తులో ముఖ్యంగా 2064 లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించారు. ఆహారం, నీరు, మానవత్వం అనేవి కరువైనప్పుడు, విచక్షణ జ్ఞానం కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డారు? అనే థీమ్ తో.. ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే విధంగా ఉన్నాయి. కాగా కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!