డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రద్ధ శ్రీనాథ్. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె హాజరైంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన వలన తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. మరో రెండు రోజుల్లో మన సినిమా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారు మీలాంటి ఒక లెజెండ్తో వర్క్ చేయడానికి చాలా అదృష్టం ఉండాలి. నిజానికి మిమ్మల్ని కలవడానికి ముందు నాకు చాలా భయం ఉండేది.
Daaku Maharaj: థమన్ అంటే అంతేరా.. బాక్సులు బద్దలు అవ్వాల్సిందే!
కానీ కలిసిన క్షణాల్లోనే మీరు నన్ను చాలా కంఫర్టబుల్ చేసేశారు. అది మీకు చాలా చిన్న విషయం కానీ నాకు, మా అందరికీ అది చాలా పెద్ద విషయం. మీలో ఒక ఇన్నోసెన్స్ ఉంది. అది చిన్న పిల్లలకు ఉండే ఇన్నోసెన్స్ లాంటిది. మీలో ఒక క్యూరియాసిటీ ఉంది. మీరు ఎంత పెద్ద స్టార్ అయినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అంటారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. మీతో ఒక పాటు కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. బాబి గారు నా క్యారెక్టర్ నందిని రాసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. నేను చేసిన సినిమాలలో ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ గా నిలుస్తుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.