Site icon NTV Telugu

Shraddha Kapoor: ఆ విషయంలో మోదీని వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్

Shraddha Kapoor

Shraddha Kapoor

Shraddha Kapoor gains more followers than PM Modi in Instagram: ప్రధానమంత్రి మోదీని ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వెనక్కి నెట్టేసిన్నది. అదేంటి అని అనుకుంటున్నారా? నిజమేనండి ఒక రకంగా చెప్పాలంటే ఇండియా వరకు చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆయనకు ఇంస్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ విషయంలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. పొలిటీషియన్స్ లో ఆయనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ సూపర్ స్టార్లకు సైతం లేని పాపులారిటీ మోడీకి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో నరేంద్ర మోడీని దాటేసింది. ఇంస్టాగ్రామ్ లో తాజాగా ఆమెకు 91.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చేశారు. అయితే మోడీ విషయానికి వస్తే మాత్రం 91.3 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు.

Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్.. పూరీ సంచలన నిర్ణయం?

ఒక రకంగా ఆమె మోదీని దాటి ముందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఇండియా మొత్తం మీద అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. ఆయనకు ఏకంగా 271 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత స్థానంలో ప్రియాంక చోప్రా 91.8 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకోగా ఇప్పుడు శ్రద్ధా కపూర్ మూడవ స్థానంలో నిలిచి 91.6 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకుంది. ఇక ప్రధానమంత్రి మోడీ నాలుగో స్థానంలో ఉండగా అలియా భట్ 85.2 మిలియన్ ఫాలోవర్స్ తో ఐదవ స్థానంలో ఉంది. స్త్రీ 2 సినిమాలో ఇటీవలే శ్రద్ధా కపూర్ కనిపించింది, ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రాజకుమార్ రావు హీరోగా నటించిన ఈ హారర్ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయిన తర్వాత శ్రద్ధా కపూర్ కి ఫాలోవర్స్ పెరుగుతున్నారని అంచనా వేస్తున్నారు.

Exit mobile version