Site icon NTV Telugu

Kingdom : కింగ్డమ్ రిలీజ్ వాయిదా వేయక తప్పదా..?

Kingdom

Kingdom

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్నమోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్‌డ‌మ్. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్‌ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్‌ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన ఫ‌స్ట్ లుక్‌కు, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ టీజ‌ర్‌కు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడు.

Also Read : Mohanlal : తుడరుమ్ అన్ స్టాపబుల్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా.?

ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉన్న కింగ్‌డ‌మ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ఇదే వరకే ప్రకటించారు. కానీ పరిస్థితి చూస్తుంటే వాయిదా పడేలా ఉందని సమాచారం. అందుక్కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు. సంవత్సరాల తరబడి షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా షూటింగ్ నేటితో ముగిసింది. ఇప్పటికె అనేక దఫాలు వాయిదా పడిన హరిహర వీరమల్లు మే 30న వస్తామని ప్రకటించారు. పవన్ సినిమా షూటింగ్ ఇప్పట్లో అవ్వదని చాలా కాన్ఫిడెంట్ గా మే 30 డేట్ వేశారు కింగ్డమ్ మేకర్స్. తీరా ఇప్పుడు చూస్తూ హరిహర వచ్చేలా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాపై సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ నిర్మిస్తున్న కింగ్డమ్ ను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడు. అయితే హరిహర వీరమల్లు పక్కాగా మే 30న వస్తుందా వాయిదా పడుతుందా అన్నది డిజిటల్ స్ట్రీమింగ్ పై ఆధారపడి ఉందట. ఒకవేళ వస్తే మాత్రం విజయ్ సినిమా విడుదల వాయిదా పక్కా.

Exit mobile version