Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. “రేపు నా కల నిజమవుతోంది”!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivathmika Rajasekhar: సినిమా అంటేనే ఒక ఎమోషన్. ఆ రంగుల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనే నటీమణుల్లో యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ ఒకరు. తాజాగా ఆమె నటించిన క్రేజీ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (#ENERepeat) రేపు (నవంబర్ 19న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్‌కు ఒక్కరోజు ముందు శివాత్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో శివాత్మిక ‘కీర్తన’ అనే కీలక పాత్రలో కనిపించబోతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ తనలో ఉన్న ఎగ్జైట్మెంట్ను, ఎమోషన్‌ను ఆమె అభిమానులతో పంచుకుంది. “ఇది కలేం కాదు మా.. రేపు నా కల నిజమవుతోంది. నవంబర్ 19 నుంచి మా #ENERepeat థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని, నన్ను కూడా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు, ఇకపై ప్రతి శుక్రవారం కొత్త కొత్త కథలతో థియేటర్లలో మిమ్మల్ని కలుస్తూనే ఉండాలని ఆశిస్తున్నానని చెప్పిన శివాత్మిక, చివర్లో “ఎందుకంటే.. నాకు సినిమాలంటే పిచ్చి! – కీర్తన” అంటూ పెట్టిన లైన్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. సినిమాల పట్ల ఆమెకున్న ఇష్టం, ప్యాషన్ ఆ ఒక్క మాటలో స్పష్టంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ చిత్రంపై యూత్‌లో ఇప్పటికే భారీ బజ్ ఉంది. మరి రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ గ్యాంగ్, ‘కీర్తన’ పాత్రలో శివాత్మిక ఆడియన్స్‌ను ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.
Also Read
Idhi kalem kadhu ma🫶🏼
My dream comes true tomorrow, #ENERepeat in theatres from Nov 19th.I hope you guys like our film, I hope you like me and I hope we can keep meeting in the theatres on fridays with new stories to tell,
Endhukante….
Naaku cinema lu ante pichi! -Keerthana https://t.co/xShtJhpdgu— Shivathmika Rajashekar (@ShivathmikaR) November 18, 2026
తాజావార్తలు
-
Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. “రేపు నా కల నిజమవుతోంది”!
-
Nayanthara : “నేను మదర్ థెరిసాను కాను” అయితే ఏంటి? నయనతార కీలక వ్యాఖ్యలు!
-
Cyclone Akvan : ఊపిరి పీల్చుకున్న ఏపీ తీరం.. తప్పిన అతి తీవ్ర తుఫాన్ ముప్పు
-
Bancroft: బాల్ ట్యాంపరింగ్ అందరికీ తెలుసు.. ఆస్ట్రేలియా బండారం బయటపెట్టిన బ్యాన్‌క్రాఫ్ట్..
-
Varanasi: రాజమౌళి – మహేశ్ ‘వారణాసి’కి ఐపీఎల్ గండం.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..