Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. “రేపు నా కల నిజమవుతోంది”!

Shivathmika Rajasekhar

Shivathmika Rajasekhar

Shivathmika Rajasekhar: సినిమా అంటేనే ఒక ఎమోషన్. ఆ రంగుల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనే నటీమణుల్లో యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ ఒకరు. తాజాగా ఆమె నటించిన క్రేజీ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (#ENERepeat) రేపు (నవంబర్ 19న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్‌కు ఒక్కరోజు ముందు శివాత్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో శివాత్మిక ‘కీర్తన’ అనే కీలక పాత్రలో కనిపించబోతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ తనలో ఉన్న ఎగ్జైట్‌మెంట్‌ను, ఎమోషన్‌ను ఆమె అభిమానులతో పంచుకుంది. “ఇది కలేం కాదు మా.. రేపు నా కల నిజమవుతోంది. నవంబర్ 19 నుంచి మా #ENERepeat థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని, నన్ను కూడా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు, ఇకపై ప్రతి శుక్రవారం కొత్త కొత్త కథలతో థియేటర్లలో మిమ్మల్ని కలుస్తూనే ఉండాలని ఆశిస్తున్నానని చెప్పిన శివాత్మిక, చివర్లో “ఎందుకంటే.. నాకు సినిమాలంటే పిచ్చి! – కీర్తన” అంటూ పెట్టిన లైన్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. సినిమాల పట్ల ఆమెకున్న ఇష్టం, ప్యాషన్ ఆ ఒక్క మాటలో స్పష్టంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ చిత్రంపై యూత్‌లో ఇప్పటికే భారీ బజ్ ఉంది. మరి రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ గ్యాంగ్, ‘కీర్తన’ పాత్రలో శివాత్మిక ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తారో చూడాలి.