హీరో-నిర్మాత పుట్టినరోజునే ‘శివం భజే’ రిలీజ్.. అదొక్కటే కాదు చాలా ఉంది: నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivam Bhaje Producer Maheshwara Reddy Nooli Interview: గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ సినిమా ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ అంచనాలను పెంచేసింది. తాజాగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన సినిమా సంగతులివే
బర్త్ డే సందర్భంగా:
నాది, హీరో అశ్విన్ బాబుది బర్త్ డే సందర్భంగా అని ఏమీ ఈ సినిమాను ఆగస్ట్ 1న రిలీజ్ చేయడం లేదు. మేం ఒక డేట్ అనుకున్నాం.. అది ఆయన బర్త్ డే అయింది. అంతే కానీ మేమేదో కావాలని పుట్టిన రోజు స్పెషల్‌గా రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేయలేదు.
Also Read
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఐదు నిమిషాల్లోనే ఓకే:
శివం భజే కథను ముందుగా నేను విన్నా. నాకు చాలా నచ్చి విన్న వెంటనే అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తరువాత ఈ కథను అశ్విన్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా వెంటనే నచ్చింది. ఐదు నిమిషాల్లోనే ఓకే చెప్పేశారు. అలా ప్రాజెక్ట్ ముందుకు కదిలింది.
కథను పూర్తిగా రివీల్ చేయలేను. చాలా లేయర్స్ ఉంటాయి. ఇది ఒక జానర్‌కు మాత్రమే పరిమితం అవుతుందని కూడా చెప్పలేను. ఐదారు జానర్లు కలిసి తీసిన సినిమాలా ఉంటుంది. అన్ని రకాల అంశాలుంటాయి. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ట్విస్టులను అయితే ఇప్పుడు రివీల్ చేయలేను. నేను శివుడి భక్తుడ్ని కాబట్టి.. ఈ సినిమాను తీయలేదు. కథ చాలా బాగుంటుంది.
శివం భజే చిత్ర విడుదలకు ఇదే సరైన సమయం అని భావించా, డిస్ట్రిబ్యూటర్‌గానూ ఆలోచించాను. అందుకే ఈ డేట్‌ను ఫిక్స్ చేశాం. ఇక మున్ముందు పెద్ద సినిమాలు రాబోతోన్నాయి. క్వాలిటీ, కంటెంట్ కోసం అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువే బడ్జెట్ పెట్టాను.
మ్యూజిక్ డైరెక్టరే ఈ చిత్రానికి హీరో. హిడింబ చూశాక ఆయన్ను తీసుకోవాలని అనుకున్నాం. అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఈ మూవీని హైదరాబాద్ చుట్టూనే తీశాం. కథ కూడా పూర్తిగా ఇక్కడే తిరుగుతుంది.
విక్టరీ వెంకటేష్ ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. ఇంత వరకు ఈ చిత్రాన్ని ఎవ్వరికీ చూపించలేదు. అశ్విన్ కి, వెంకటేష్ కి క్రికెట్ వల్ల మంచి రిలేషన్ ఉంది, ట్రైలర్ చూడటంతో నచ్చి అభినందించారు.
కంటెంట్ బాగుంటే ఆడియన్స్ సినిమా చూస్తారు. టికెట్ రేట్లు తక్కువ పెట్టినా, ఎక్కువ పెట్టినా కూడా సినిమా బాగుందనే మౌత్ టాక్ వస్తే సినిమా చూస్తారు.
ఐఐటీ కృష్ణమూర్తి టీంతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. కార్తికేయతో ఓ సినిమా ఉంది. శివం భజే హిట్ అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాం. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్ అయితే అమ్ముడుపోయాయి. ఈ చిత్రం హిట్ అయితే.. రెండో పార్ట్‌ని కూడా ప్లాన్ చేస్తాం.
తాజావార్తలు
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!