Site icon NTV Telugu

Shine Tom Chako: డ్రగ్స్ రైడ్ తప్పించుకునేందుకు సాహసం.. 3వ ఫ్లోర్ నుంచి దూకి మరీ పరార్!

Shine Escape

Shine Escape

మలయాళ నటుడు, ఈ మధ్యకాలంలో పలు సౌత్ సినిమాల్లో నటిస్తున్న షైన్ టామ్ చాకో, డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అతనిపై మలయాళ నటి విన్సీ, మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’కి ఫిర్యాదు చేసింది. షూటింగ్ సెట్‌లోనే డ్రగ్స్ తీసుకుని తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ నేపథ్యంలో అతని వద్ద డ్రగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసేందుకు వెళ్లిన పోలీసులను మాస్క్ కొట్టి షైన్ తప్పించుకున్నాడు.

Shine Tom Chacko : డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నాని విలన్?

మలయాళ టీవీ ఛానెల్‌లలో ప్రచారం జరుగుతున్న దాని మేరకు, షైన్, అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు అనుచరులతో కలిసి ఒక హోటల్ మూడో అంతస్తు కిటికీ నుంచి దూకి మాయమైనట్లు తెలుస్తోంది. ముందుగా మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తుకు దూకి, అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి, ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి రిసెప్షన్ ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి రైడ్ జరుగుతున్న విషయం తెలుసుకుని అతను పారిపోయినట్లు సమాచారం.

కేరళ పోలీసులతో పాటు కేరళ పోలీసుల డిస్ట్రిక్ట్ యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ రైడ్ చేసిన తర్వాత, షైన్ రూమ్‌లో ఎలాంటి అనధికార వస్తువులు దొరకలేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నాడని, అందుబాటులోకి వచ్చిన తర్వాత అతన్ని విచారించే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ విషయంపై స్పందించిన షైన్ తల్లి మరియా, తన కొడుకు భయంతో పారిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. “నార్కోటిక్ అధికారులు అతని రూమ్‌లో ఏమైనా తప్పుగా కనుగొన్నారా? నాకు అతని గురించి బాగా తెలుసు. భయపడి పారిపోయి ఉండవచ్చు. పోలీసులు కూడా అక్కడికి యూనిఫామ్‌తో వెళ్లలేదు,” అని ఆమె ఆరోపించారు.

ఇటీవల తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో కూడా షైన్ ఒక చిన్న పాత్రలో కనిపించాడు.

Exit mobile version