NTV Telugu Site icon

‘విజయ్65’లో మలయాళ స్టార్ నటుడు

Shine Tom Chacko joins Thalapathy 65

దళపతి విజయ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ లో ‘విజయ్65’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఏప్రిల్‌లో జార్జియాలో ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగింది. జార్జియాలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాత విజయ్, మిగిలిన బృందం చెన్నైకి తిరిగి వచ్చారు. గత కొద్దిరోజుల క్రితం షూటింగ్ సెట్లో విజయ్ కు సంబంధించిన పిక్ ను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజా అప్డేట్ ప్రకారం ‘విజయ్65’లో మలయాళ స్టార్ నటుడు నటించబోతున్నాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్నాడు. షైన్ మాట్లాడుతూ “నేను చర్చల కోసం ఇక్కడ ఉన్నాను. సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇప్పటికే జార్జియాలో ముగిసింది. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం అవ్వొచ్చు. ఒకవేళ కరోనా ఆంక్షల వల్ల కాకపోతే జూన్ లో షెడ్యూల్ ప్రారంభం కావొచ్చు. నాకు ఇంకా తమిళం అంత ఫ్లూయెంట్ గా రాదు. నేను తరచూ తమిళ చిత్రాలను చూస్తూ ఉంటాను. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి తమిళ నటుల ఇంటర్వ్యూలు, ప్రసంగాలు కూడా చూస్తాను. కొన్ని పదాలు నాకు అర్థం కావు… కానీ నేను దాని నుండి అర్ధం చేసుకోగలను” అంటూ చెప్పుకొచ్చారు షైన్.