SHine Tom Chaco : దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటున్నాడు. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అడ్డంగా దొరికిపోయాడు. అప్పటి నుంచి అతనికి మలయాళ ఇండస్ట్రీలో అవకాశాలు దొరకట్లేదు. తాజాగా ఆయన యాక్సిడెంట్ గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. నేను జీవితంలో ఎన్నో బాధలు అనుభవించి వచ్చాను. రోడ్డు ప్రమాదం మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదం గురించి ఎప్పుడూ భయపడుతూ ఉంటాను. అందుకే ఇప్పటి వరకు నేను ప్రమాదాలను ఎంకరేజ్ చేయను.
Read Also : Surya : వెకేషన్ లో స్టార్ హీరో, హీరోయిన్
మా చిన్నతనంలో మా నాన్న, అమ్మ, సోదరుడు నేను కలిసి ప్రయాణిస్తున్నాం. సడెన్ గా మా నాన్న నడుపుతున్న కారుకు యాక్సిడెంట్ అయింది. నేను స్పృహ కోల్పోయాను. సడెన్ గా లేచి చూసేసరికి అందరం రోడ్డు మీద ఉన్నాం. మా నాన్న ఎంత పిలిచినా లేవలేదు. అప్పుడు రోడ్డు మీద కూర్చుని ఏడ్చాను. అందరినీ బతిమాలుతూ సాయం అడిగాను. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏడ్చేశాను అంటూ చెప్పాడు టామ్ చాకో. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దసరా సినిమాలో విలన్ గా చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు షైన్ టామ్ చాకో. మలయాళంలో మంచి సినిమాలు చేస్తున్న సమయంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఇరకాటంలో పడ్డాడు.
Read Also : Raghava Lawrence : నిన్ను కొట్టను.. వచ్చి కలువు.. అతనికి రాఘవ లారెన్స్ ఆఫర్..
