నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌కు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సినిమాకు సంబంధించి ఒక కీలకమైన కొత్త పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది. శోభ అనే పాత్రలో నటి శిల్పా శిరోద్కర్‌ను ఎంపిక చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె నల్ల చీర కట్టుకుని హోమగుండం ముందు కూర్చుని ఉన్నారు. ఈ పోస్టర్ మొత్తం ఆధ్యాత్మిక శక్తితో నిండి, తాంత్రిక శక్తులను సూచిస్తోంది. శిరోద్కర్ పోస్టర్‌లో చూపించిన సీరియస్ లుక్ సినిమాలోని సూపర్ నేచురల్, ఆధ్యాత్మిక వాతావరణానికి సరిగ్గా సరిపోయింది.
Also Read:Pawan Kalyan : మొన్న విజయ్.. నేడు బాలయ్య.. పవన్ కు పోటీనే లేదా..?
మహేష్ భార్య నమ్రత చెల్లెలైన శిల్ప చాలా కాలం నుంచి సినిమాలకు తీసుకుంది ప్రస్తుతం దుబాయిలో సెటిల్ అయినా ఆమె ఈ సినిమా కథ లోని పాత్ర నచ్చడంతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఈ సినిమాని ఎంచుకుంది. జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా సమర్పిస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా నిర్మిస్తున్నారు. సంగీతం జీ మ్యూజిక్ కో అందించగా, దివ్య విజయ్ క్రియేటివ్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రొడ్యూసర్స్ శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుయణ అగర్వాల్, శిల్పా సింగాల్, అలాగే కో-ప్రొడ్యూసర్స్ అక్షయ్ కేజ్రివాల్, కుస్సుం అరోరా మద్దతు ఇస్తున్నారు.
