NTV Telugu Site icon

ఎట్టకేలకు స్పందించిన శిల్పాశెట్టి… భర్త కేసుపై సుదీర్ఘ వివరణ

Shilpa Shetty released her statement in Raj Kundra case

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గత కొన్ని రోజులుగా తన భర్త రాజ్ కుంద్రా కేసు కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. జూలై 19న పోర్న్ సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత శిల్పాశెట్టి గురించి అనేక వార్తలు వచ్చాయి. రాజ్ కుంద్రాతో పాటు ఆయన ఫ్యామిలి, పిల్లలు, భార్యపై కూడా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. రాజ్ ఇప్పటి వరకూ తన వెర్షన్ ఏంటో ఎవరికీ చెప్పలేదు. కానీ పోలిసులు ఇస్తున్న సమాచారం ప్రకారమే వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులూ మౌనంగా ఉన్న శిల్పా ఈ రోజు ఎట్టకేలకు మౌనం వీడింది. మొదటిసారి తన సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకుంది. ఈ పోస్ట్‌లో తన గురించి అనేక వార్తలు మీడియాలో నిరంతరం వస్తూనే ఉన్నాయని చెప్పింది.

Read Also : “పుష్ప” అప్డేట్ : ఫస్ట్ సింగిల్ డేట్ ప్రకటించిన మేకర్స్

ఆ పోస్టులో శిల్పాశెట్టి “గత కొన్ని రోజులుగా నాకు ఛాలెంజింగ్ గా ఉన్నాయి. చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి. మీడియాతో పాటు శ్రేయోభిలాషులుగా పిలవబడే కొందరు నాపై అవాంఛనీయ ఆరోపణలు చేస్తున్నారు. నాకు మాత్రమే కాకుండా నా కుటుంబానికి కూడా చాలా ట్రోలింగ్/ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పుడు నేను వ్యాఖ్యానించలేను. ఇది అన్యాయం కాబట్టి దయచేసి నా భర్తపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆపి వేయండి. సెలబ్రిటీగా నా ఫిలాసఫీ ఏంటంటే “ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు, వివరించవద్దు”. నేను చెప్పేది ఏమిటంటే దర్యాప్తు కొనసాగుతోంది… నాకు ముంబై పోలీసు, భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఒక కుటుంబంగా మేము అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను ఆశ్రయిస్తున్నాము. కానీ అప్పటి వరకు నేను వినయంగా అడుగుతున్నాను… ముఖ్యంగా తల్లిగా నా పిల్లల కోసం మా గోప్యతను గౌరవించమని, నిజం ఏంటో తెలుసుకోకుండా తెలిసీ తెలియని సమాచారంతో వ్యాఖ్యానించడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నాను. నేను గర్వించదగిన చట్టాన్ని గౌరవించే భారతీయ పౌరురాలిని. గత 29 సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తున్న నటిని. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. నేను ఎవరినీ నిరాశపరచలేదు. కాబట్టి ముఖ్యంగా ఈ సమయంలో నా కుటుంబం గోప్యతపై ‘నా హక్కు’ను గౌరవించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
మాకు మీడియా విచారణ అవసరం లేదు
దయచేసి చట్టాన్ని పని చేసుకోనివ్వండి.
సత్యమేవ జయతే!

పాజిటివిటీ, కృతజ్ఞతతో,
శిల్పా శెట్టి కుంద్రా” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేశారు.

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)