Site icon NTV Telugu

UnstoppableWithNBK : విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఆమేనట

Unstoppables4

Unstoppables4

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’. ఇప్పటికి మూడు సీజన్స్ ఫినిష్ చేసిన ఈ టాక్ షో నాలుగవ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే పలువురు స్టార్ట్ హీరోలు, దర్శకులు, హీరోయిన్స్ సందడి చేసారు. తాజాగా ఈ షోలో విక్టరీ వెంకటేష్ సందడి చేశారు. వెంకీ నటించిన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అన్ స్టాపబుల్ షోకు అతిధిగా విచ్చేసారు విక్టరీ వెంకీ. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు నుండి ఇప్పటి వరకు జరిగిన అనేక విషయాలను పంచుకున్నారు వెంకీ.

Also Read : Pushpa Collections : పుష్ప -2 అదే జోరు.. 22 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

అందులో భాగంగా మీ లైఫ్ లో ‘మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు’ అని బాలయ్య ప్రశ్నించారు. అందుకు బదులుగా వెంకీ మాట్లాడుతూ ‘నాలైఫ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ నా జీవిత భాగస్వామి నీరజ మాత్రమే. నీరజ కారణంగా ఇంకెవరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అవసరం రాలేదు. షూటింగ్స్ లేకుండా ఏమాత్రం సమయం దొరికినా నేను, నీరజ కలిసి టైమ్‌స్పెండ్‌ చేయడానికి ఇష్టపడతాం. బాగా ఇష్టమైన ప్రదేశాలకు టూర్స్‌కు వెళ్తాం. నీరజతో కలిసి నేను కూడా అప్పుడప్పుడూ వంట చేస్తుంట. అది నాకెంతో ఇష్టం, కష్టమైన సుఖమైనా ఏదైనా సరే నీరజతో పంచుకుంటాను, అప్పటికి, ఇప్పటికి ఎవరికి ఆమే నా బెస్ట్ ఫ్రెండ్ ’’ అని వెంకీ బదులిచ్చారు. ఈ కార్యక్రమానికి వెంకీ తో పాటు ఆయన అన్న ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సందడి చేసారు.

Exit mobile version