NTV Telugu Site icon

Manamey : శర్వానంద్ ‘మనమే’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Manamey

Manamey

Manamey : టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.శర్వానంద్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మనమే”..ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు.అలాగే ఏడిద రాజా అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.”మనమే” మూవీ శర్వానంద్ 35వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు.

Read Also :Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్..

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్సె వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో శర్వానంద్, కృతి శెట్టి విభిన్న పాత్రలలో నటించారు.ఇందులో విక్రమ్ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు.ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.జూన్ 7న ‘మనమే’ మూవీని రిలీజ్ చేస్తున్నట్లుగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మనమే సినిమాను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తన మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు .ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ధీమాగా వున్నారు.

Show comments