Site icon NTV Telugu

Sharwa 37 : శర్వానంద్ షూటింగ్ స్టిల్ అదిరిపోయిందిగా..

Sharwanand

Sharwanand

Sharwa 37 :టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ “మనమే”..ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గ్రాండ్ గా తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో శర్వానంద్ సరసన క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “శర్వా 37 “.ఈ సినిమాను సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్నారు.ఏకె ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read Also :Devara : ‘దేవర’కు భారీ హైప్ ఇస్తున్న ఆ స్టార్ యాక్టర్..?

ప్రేమ, నవ్వు కలయికను ఇంతకుముందు ఎప్పుడు లేనివిధంగా సెలెబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా వుండండి..అద్భుతమైన ఫన్ రైడ్ అంటూ ఈ చిత్రం షూటింగ్ స్టిల్ ను మేకర్స్ రిలీజ్ చేసారు .ప్రస్తుతం స్టిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఈ మూవీ షూటింగ్ గురువారమే ఎంతో గ్రాండ్ గా మొదలైంది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్టిల్ బాగా వైరల్ అవుతుంది. అలాగే “శర్వా 36 ” మూవీ కూడా ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయింది.అభిలాష్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం షూటింగ్ స్టిల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Exit mobile version