Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శార్వరీ వాఘ్ (Sharvari Wagh) త్వరలోనే ‘మై వాపస్ ఆవుంగా’ అనే క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆమె కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయిన ‘ఆల్ఫా’ (Alpha) లో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt), శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు శివ్ రావెల్ తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శార్వరీ.. ఈ సినిమా షూటింగ్ విశేషాలతో పాటు అలియా భట్‌తో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని పంచుకుంది.
అలియా భట్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ శార్వరీ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడింది.. ‘ ‘ఆల్ఫా’ చిత్రం వర్క్‌షాప్స్ ప్రారంభమైనప్పుడే నాకు అలియా భట్‌తో మొదటి పరిచయం ఏర్పడింది. ఈ సినిమా ప్రిపరేషన్స్ దగ్గరి నుండి షూటింగ్ వరకు మేమిద్దరం కలిసి చాలా ప్రయాణించాం. ఒక్క మాటలో చెప్పాలంటే, అలియాలో నాకు ఒక మంచి స్నేహితురాలు (Best Friend) దొరికింది. నిజానికి నేను ఎప్పటి నుంచో అలియాకు పెద్ద అభిమానిని. కానీ, భవిష్యత్తులో ఏదైనా సహాయం కావాలంటే నేరుగా ఆమెకు ఫోన్ చేసి అడిగేంత క్లోజ్ అవుతానని నేనెప్పుడూ ఊహించలేదు. ఆమె తన చుట్టూ ఉన్న వారందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరస్తుంది. షూటింగ్ సెట్లో ఆమె నటనను అంత దగ్గర నుండి చూడటం, ఆమె పని విధానాన్ని గమనించడం, నాకు వచ్చే సందేహాలను అడిగి తెలుసుకోవడం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నటిగా అలియా అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే, కానీ ఈ సినిమా జర్నీ తర్వాత ఆమెపై నాకున్న గౌరవం, అభిమానం రెట్టింపయ్యాయి’ అని తెలిపింది. ప్రజంట్ శార్వరీ వాఘ్ మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!