Site icon NTV Telugu

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ కొత్త ప్రేయసి వైష్ణవే? ఇదిగో ప్రూఫ్!

Deepthi

Deepthi

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌ అయింది. గత కొంతకాలంగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న షణ్నూ, తాజాగా తన కొత్త ప్రేయసిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. అయితే ఆమె పేరును పూర్తిగా వెల్లడించకుండా కేవలం ‘V’ అనే అక్షరంతో హింట్ ఇవ్వడంతో నెటిజన్లు ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం, ఆ ‘V’ మరెవరో కాదు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వైష్ణవి చోడిశెట్టి అని తెలుస్తోంది.

Also Read:Bigg Boss : ‘బిగ్ బాస్ 9’ ఫినాలే: సరికొత్త రికార్డుల రారాజు!

షణ్ముఖ్ జస్వంత్ తన ఇన్‌స్టాగ్రామ్లో ఒక ఫోటోను షేర్ చేశాడు. అందులో ఒక అమ్మాయి చేయి పట్టుకుని, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ “న్యూ బిగినింగ్స్” అంటూ కొన్ని ఎమోజీలను జత చేశాడు. పేరు స్థానంలో కేవలం ‘V’ అని మాత్రమే పేర్కొన్నాడు. దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్నాడు. ఆ మధ్యకాలంలో తను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, డిప్రెషన్‌ను పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తన జీవితంలోకి కొత్త వ్యక్తి రావడంతో షణ్నూ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎవరీ వైష్ణవి చోడిశెట్టి?

Also Read:Ravi Teja: ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతి స్పెషల్ మాస్ బీట్ రెడీ

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, షణ్ముఖ్ మనసు దోచుకున్న ఆ అమ్మాయి పేరు వైష్ణవి చోడిశెట్టి. కాకినాడకు చెందిన వైష్ణవి కూడా ఒక ప్రముఖ డిజిటల్ క్రియేటర్ మరియు మోడల్. అయితే గతంలో షన్నుతో పలు వెబ్ సిరీస్ లు చేసి ప్రస్తుతం హీరోయిన్గా కొనసాగుతున్న వైష్ణవి చైతన్య వేరే, ఈ వైష్ణవి వేరే. ఈమె గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్‌లలో నటించింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. షణ్ముఖ్, వైష్ణవి ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండటంతో, వారి ద్వారానే పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని టాక్ వినిపిస్తోంది. షణ్ముఖ్ పోస్ట్ చేసిన ఫోటోలో అమ్మాయి ముఖం కనిపించకపోయినా, ఆమె చేతి మీద ఉన్న టాటూని బట్టి నెటిజన్లు ఆమె వైష్ణవిఅని కనిపెట్టేశారు. “ఎట్టకేలకు షణ్నూ మళ్ళీ సంతోషంగా ఉన్నాడు.. ఆల్ ది బెస్ట్ బ్రో” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం దీప్తి సునయన ప్రస్తావనను మళ్ళీ తెరపైకి తెస్తున్నారు.

Exit mobile version