NTV Telugu Site icon

ఇండియా అన్నా, బాలీవుడ్ అన్నా… షారుఖే అంటోన్న బ్రిటీష్ సూపర్ స్టార్!

Shah Rukh Khan's witty reply to Tom Hiddleston

‘లోకి’ … మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో పరిచయం ఉన్న వాళ్లందరికీ తెలిసిన పేరే! మార్వెల్ కామిక్స్ లోని సూపర్ హీరోస్ లో ‘లోకి’ ‘గాడ్ ఆఫ్ మిస్ చీఫ్’గా వ్యవహరింపబడతాడు. అయితే, ‘లోకి’ పాత్రని పెద్ద తెరపై అనేకసార్లు పోషించాడు బ్రిటీష్ యాక్టర్ టామ్ హిడిల్ స్టన్. ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘లోకి’ వెబ్ సిరీస్ లో కూడా టామే టైటిల్ రోల్ పోషించాడు.

బ్రిటన్, అమెరికన్, యూరోపియన్ ఆడియన్సే కాదు టామ్ అంటే ఇండియాలోనూ చాలా మంది అభిమానం ప్రదర్శిస్తారు. ‘లోకి’గా ఆయన అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అయితే, ఆయనకి అంత మంది ఫ్యాన్స్ ఉన్నా తాను ఎవరికి అభిమానో తెలుసా? నన్ అదర్ ద్యాన్ అవరోన్… ‘షారుఖ్ ఖాన్’!

సొషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఓ వీడియోలో టామ్ హిడిల్ స్టన్ రెండుసార్లు కింగ్ ఖాన్ పేరు తలుచుకున్నాడు. ‘ఇండియా’ అనగానే ఆయన తడుముకోకుండా ‘షారుఖ్’ అన్నాడు. మరోసారి ‘బాలీవుడ్’ అంటే కూడా ‘షారుఖ్ ఖాన్’ అని బదులిచ్చాడు! టామ్ ఒకటికి రెండు సార్లు బాలీవుడ్ బాద్షాపై అభిమానం వ్యక్తం చేయటంతో ఎస్ఆర్కే ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

టామ్ హిడిల్ స్టన్ తన పేరు పలకటంతో షారుఖ్ కూడా స్పందించాడు. ‘అభిమానానికి ధన్యవాదాలు’ అంటూనే ‘లోకి’ అంటే మిస్ చీఫ్ కి గాడ్ కదా… నీ సమాధానల్లో ఎలాంటి ‘మిస్ చీఫ్’ లేదా ‘పరాచికం’ లేదనే భావిస్తున్నా అన్నాడు సరదాగా! బీ-టౌన్ బాద్షా విట్టీ రిప్లైని నెటిజన్స్ తెగ మెచ్చుకుంటున్నారు! ‘లోకి’ ఎపిసోడ్ 1 ప్రస్తుతం చూస్తున్నాను అని కూడా ‘పఠాన్’ స్టార్ పేర్కొన్నాడు! మరి మీరు కూడా ‘లోకి’ పై ఓ లుక్కేస్తారుగా…

Show comments