Shah Rukh Khan: వన్ ఇయర్‌లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!

Shah Rukh Khan

Shah Rukh Khan

Shah Rukh Khan: ఒక్క ఏడాది వ్యవధిలోనే ఏకంగా రూ.2,490 కోట్ల లాస్ అంటే ఏ కార్పొరేట్ దిగ్గజానికైనా గుండె గుభిల్లుమంటుంది. కానీ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రేంజ్ వేరు. తన ఆర్థిక సామ్రాజ్యానికి ఊహించని కుదుపునకు లోనైనా, దేశంలోనే నంబర్ వన్ రిచ్ యాక్టర్‌గా తనపేరు మీదన్న రికార్డును మాత్రం చేంజ్ కాలేదు. ఎంతలా అంటే.. తన సంపదలో ఇంత పెద్ద లాస్ వచ్చిన తర్వాత కూడా, రెండో స్థానంలో ఉన్న అమితాబ్ బచ్చన్ ఆస్తి కంటే షారుఖ్ నికర విలువ ఇంకా రెట్టింపు కంటే ఎక్కువే ఉండటం విశేషం. ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ తాజా లెక్కల ప్రకారం షారుఖ్ ఖాన్ నికర సంపదలో తీవ్ర క్షీణత కనిపించింది. గతేడాది ఏకంగా రూ.12,490 కోట్లుగా నమోదైన ఆయన ఆస్తుల విలువ, ఈ ఏడాదికి వచ్చేసరికి రూ.10,000 కోట్లకు పడిపోయింది.

అంటే వన్ ఇయర్‌లోనే రూ.2,490 కోట్లు ఆవిరైపోయాయి. షారుఖ్ కేవలం సినిమాలపైనే కాకుండా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి బడా స్పోర్ట్స్ వెంచర్లలో విస్తృత పెట్టుబడులు పెట్టారు. మార్కెట్ ఒడిదుడుకులు, వ్యాపార భాగస్వామ్యాల విలువల మార్పుల వల్లనే ఈ మేర సంపద తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. సంపద భారీగా కరిగిపోయినా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో షారుఖ్ దరిదాపుల్లోకి ఏ ఇతర నటుడూ లేరు. ప్రస్తుతం రూ.10,000 కోట్లతో షారుఖ్ టాప్‌లో కొనసాగుతుండగా.. రూ.4,000 కోట్లతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ రెండో స్థానంలో, రూ.3,000 కోట్లతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో, రూ.2,500 కోట్లతో హృతిక్ రోషన్ నాలుగో స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న అమితాబ్ కంటే షారుఖ్ ఆస్తులు ఇంకా రెండున్నర రెట్లు ఎక్కువగానే ఉన్నాయి.