Site icon NTV Telugu

Shah Rukh Khan: మళ్ళీ ‘3’పై కన్నేసిన షారుఖ్ ఖాన్

Shah Rukh Khan

Shah Rukh Khan

Shah Rukh Khan Hattrick Planning of Movies: హిరోలకి సెంటిమెంట్స్ ఎక్కువ. ఎదైనా ఒక విషయం కెరీర్ కి ప్లస్ అయితే దాన్ని ప్రతిసారి రిపీట్ చేస్తారు . బాద్ షా కూడా ఇప్పుడు అదే రూట్ లో ట్రావెల్ చేస్తున్నారు. 2025 లో హ్యాట్రిక్ మూవీస్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. సిద్ధార్ధ్‌ తో చేసిన పఠాన్ వెయ్యి కోట్లు రాబడితే అట్లీ తో చేసిన జవాన్ 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక డిసెంబర్ లో వచ్చిన డంకీ 600 కోట్లు వసూళ్లు చేసి బాలీవుడ్ కి సెఫ్ ఎండింగ్ అందించింది. దీంతో ఖుషి అయిన షారుఖ్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది నిరాశే మిగిలింది. ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు కింగ్ ఖాన్. అస‌లు ఎవరితో సినిమా చేస్తాడో చెప్పడం లేదు. పూర్తిగా రెస్ట్ మోడ్ లోనే ఉన్నాడు. క‌థ‌లు విన‌డం…సొంత బ్యానర్ లో అప్ డేట్స్ చూసుకోవ‌డం తప్ప ఏం చేసింది లేదు. అయితే 2025 లో మాత్రం షారుఖ్ నుంచి మళ్లీ హ్యాట్రిక్ సినిమాలు రాబోతున్నట్లు బీ టౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Pushpa 2: పుష్ప- 2 ది రూల్‌ ఫస్టాఫ్‌ లాక్‌..ఇక టెన్షన్ లేనట్టే!

స్త్రీ-2తో భారీ విజ‌యం అందుకున్నాడు అమ‌ర్ కౌశిక్. వరల్డ్ వైడ్ గా 800 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు షారుఖ్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఇద్దరి మధ్య కథ చర్చలు పూర్తయ్యాయి. 2025 జనవరిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సౌత్ డైరెక్టర్ తో ఒకటి గతంలో హిట్ ఇచ్చిన నార్త్ దర్శకుడితో మరో మూవీ చేయడానికి షారుఖ్ చర్చలు జరుపుతున్నాడు. ఈ ఏడాది డిసెంబ‌ర్ చివ‌ర‌క‌ల్లా ఆ రెండు సినిమాల వివ‌రాలు కింగ్ ఖాన్ ప్రకటించే ఛాన్స్ ఉంది. మొత్తానికి 2025 లో కూడా 2023 స్ట్రాటజీనే రిపీట్ చేస్తున్నాడు షారుఖ్.

Exit mobile version