‘కే-పాప్’ అన్నా లేదా కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ అన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది ‘బీటీఎస్’! అయితే, సెవెన్ మెంబర్ ‘బీటీఎస్’ లాగే సెవెంటీన్ మెంబర్ కొరియన్ బ్యాండ్ కూడా ఒకటి ఉంది. అదే ‘సెవెంటీన్’! వీళ్ల పాటలు కూడా అమెరికా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో దుమారం రేపుతుంటాయి. తాజాగా టీమ్ ‘సెవెంటీన్’ నుంచీ ‘యువర్ ఛాయిస్’ అనే మినీ ఆల్బమ్ జూన్ 18న విడుదలైంది. దాంతో పాటే ‘రెడీ టూ లవ్’ టైటిల్ ట్రాక్ కు సంబంధించిన మ్యూజిక్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే, జూన్ 18న ఒకరికి, 19న మరొకరికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావటంతో ‘సెవెంటీన్’ బృందంలోని గాయకులంతా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’ ఫోటోతో… ‘మీమ్స్’ వీరుల హంగామా! ఎక్కడ చూసినా ఎన్టీఆర్, చరణ్ బైకే…
సెవెంటీన్ వారి తాజా మినీ ఆల్బమ్ ‘యువర్ ఛాయిస్’ని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్లెడిస్ ఎంటర్టైన్మెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం జూన్ 18 నుంచీ 29 దాకా కరోనా ప్రోటోకాల్ ప్రకారం తమ సింగర్స్ అంతా క్వారంటైన్ లో ఉన్నారట. అలాగే, వారికి ఎటువంటి సింప్టమ్స్ లేనప్పటికీ కరోనా నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాకే జూన్ 30 నుంచీ ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. ‘సెవెంటీన్’ టీమ్ లోని సింగర్స్ అంతా ఇక ఇప్పుడు తమ ఆల్బమ్ ను అగ్రెసివ్ గా ప్రమోట్ చేసుకోవటంపై దృష్టి పెట్టనున్నారు. ‘జిమ్మీ కిమెల్ లైవ్’లో వారు తమ ఫుట్ ట్యాపింగ్ క్రేజీ మ్యూజికల్ నంబర్ ‘రెడీ టూ లవ్’ను పర్ఫామ్ చేయనున్నారు…