సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనితా, అన్షు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. మన్మధుడు బ్యూటీ అన్షు మజాకాతో రీ ఎంట్రీ ఇస్తే సినిమా ప్లాప్ కావడంతో మరో సినిమా అవకాశం రాలేదు. హాసినీ అలియాస్ జెనీలియా జూనియర్ లో మంచి రోల్ చేసింది కానీ ఏమి లాభం సినిమా ప్లాప్ గా మిగిలింది. ఇక తమ్ముడు నితిన్‌ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక నువ్వు నేను ఫేం అనిత.. సుహాస్ ఓ భామ అయ్యో రామలో నటిస్తే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు.
Also Read : SRK : షారుక్.. ‘కింగ్’ బడ్జెట్ తెలిస్తే నోరెళ్లబెడతారు
ఇక రీసెంట్ గా కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన KRAMP సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది కామ్న జెఠ్మలానీ. గోపిచంద్ రణంతో ఫేమస్ అయిన ఈ భామ బెండు అప్పారావు, కత్తి కాంతారావు తప్ప మిగిలినవీ చెప్పుకోదగ్గ సినిమాలేవీ కావు. కన్నడ, తమిళం, మలయాళంలో సినిమాలు చేసినా సరైన గుర్తింపు దక్కలేదు. ఇక కెరీర్ డల్ అవుతున్న టైంలో 2014లో పెళ్లి చేసుకొని.. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుండి క్విట్ అయ్యింది. దాదాపు పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది కామ్నా జెఠ్మలానీ. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో రీఎంట్రీలో కామ్నా జెట్మలానీకి సరైన ఎంట్రీ లభించింది. మరి తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోయిన్ హోదాను మిస్ అయిన కామ్నా సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన సక్సెస్ తో రాబోయే రోజుల్లో మరిన్ని ఛాన్సులు కొల్లగొడుతుందేమో చూడాలి.
