తెలుగు సినిమా దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అతని సినిమాలు ఎంత స్వచ్ఛంగా, సింపుల్‌గా ఉంటాయో, ఆయన వ్యక్తిత్వం కూడా అంతే నిష్కళ్మశంగా ఉంటుంది. అలాంటి దర్శకుడి నుంచి తాజాగా ‘కుబేరా’ లాంటి మాస్ యాక్షన్ మూవీ రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచిన అంశమే. టీజర్, ట్రైలర్, పాటలతోనే ప్రేక్షకులను, ఇండస్ట్రీని ఒకింత షాక్‌కు గురిచేసిన ఈ చిత్రం జూన్ 20న విడుదలై మంచి ఫలితాని దక్కించుకుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల తన మనసులోని మాటలు మీడియాతో పంచుకున్నారు.
Also Read : Samantha : ‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన సమంత
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 25 ఏళ్ల నా కెరీర్లో 10 సినిమాలు మాత్రమే చేశాను. కానీ ఒక్క సినిమా పైనా ప్రేక్షకులు నన్ను తిట్టలేదు. నా సినిమాలను ఆదరించారు. అదే నా బలం. నా సినిమాల్లో నా నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. కాసుల కోసం కాదు, కంటెంట్ కోసం సినిమా తీయాలనే దృక్పథంతో ఉన్నాను. ఇక ఈ 25 ఏళ్లలో నేను ఇప్పటికీ అదే పద్మారావు నగర్ లో సింపుల్ గా, నా మనుషుల మధ్య ఉండటానికి కారణం, నేను పెరిగిన విధానం. ఈ పొజిషన్ నాకు ఆడియన్స్ ఇచ్చినది. అందువల్ల.. నేను గ్రౌండెడ్‌గా ఉండగలిగాను అని నమ్ముతాను. అందుకే మనిషిగా, దర్శకుడిగా నన్ను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు. నేను ట్రెండ్స్‌కి తగ్గట్లుగా మారిపోయే మనిషిని కాదు. కానీ ఇప్పుడు ‘కుబేరా’ లాంటి కథ కోసం కొన్ని కమర్షియల్ అంశాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇది నాకు ఒక కొత్త ప్రయోగం. ‘కుబేరా’ అనేది నేను ఇప్పటివరకు తీసిన సినిమాలకు పూర్తి విరుద్ధం.. కానీ కథ నన్ను టచ్ చేసింది అందుకే చేసాను. ప్రేక్షకుల ప్రేమ వల్లే నాకు పేరు వచ్చింది. వాళ్లు నాపై నమ్మకంతో థియేటర్‌కి వస్తారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయను’ అంటూ చెప్పుకొచ్చారు.
