ఫీల్ గుడ్, సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ప్రస్తుత సినిమా ట్రెండ్స్ పై, ముఖ్యంగా సినిమాల్లో మితిమీరిన వైలెన్స్ పై ఎన్టీవీతో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఎక్కడ చూసినా రక్తపాతం, భారీ యాక్షన్, ఫాస్ట్ పేస్డ్ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. నెత్తురు చిందిస్తేనే బాక్సాఫీస్ వద్ద కాసులు కురుస్తాయి అనేంతలా మేకర్స్ ఈ యాక్షన్ జానర్ వెంట పడుతున్నారు. అయితే ఈ “వైలెన్స్ ట్రెండ్” పై శేఖర్ కమ్ముల తనదైన శైలిలో కౌంటర్ వేశారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత వైలెన్స్ సినిమాల వర్సెస్ తన మార్క్ స్లో అండ్ బ్యూటిఫుల్ సినిమాల గురించి మాట్లాడారు. “ఒక సినిమాలో భారీ వైలెన్స్ ఉండి, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వగానే.. ఇక ఇండస్ట్రీలో అదే ట్రెండ్ అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ట్రెండ్స్ అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ చాలా క్లారిటీతో ఉంటారు. వాళ్లకు ఏం కావాలో అదే చూస్తారు. ముఖ్యంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమాలనే వారు ఎప్పుడూ ఆదరిస్తారు” అని కమ్ముల కుండబద్దలు కొట్టారు.
సినిమాల్లో అసలు ట్రెండ్స్ అనేవి ఉండవని ఆయన స్పష్టం చేశారు. “ఎనీథింగ్ దట్ కనెక్ట్స్ ఎమోషనల్లీ టు ఆడియన్స్, దే విల్ ఆల్వేస్ వాచ్. మంచి ఆర్ట్, మంచి వర్క్, మంచి సినిమా ఏదైనా సరే ఎప్పటికీ నిలబడుతుంది” అని ఆయన తన ఫిలాసఫీని బయటపెట్టారు. కేవలం కత్తులు, కొడవళ్లు, గన్స్, రక్తపాతం ఉంటేనే ఈరోజుల్లో సినిమాలు ఆడుతాయని గుడ్డిగా నమ్ముతూ, కథలో ఎమోషన్ ను గాలికి వదిలేస్తున్న ప్రస్తుత మేకర్స్ కు శేఖర్ కమ్ముల చేసిన ఈ వ్యాఖ్యలు ఒక కనువిప్పు అని చెప్పొచ్చు. హ్యూమన్ ఎమోషన్స్, చిన్న చిన్న సింపుల్ థింగ్స్ ను స్క్రీన్ పై ఎంతో అందంగా ఆవిష్కరించే కమ్ముల.. త్వరలో ధనుష్, నాగార్జునలతో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా పనులు ఇంకో రెండు నెలల పాటు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

