Secret Soldier : ‘సీక్రెట్ సోల్జర్’ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లర్, స్పై డ్రామా సినిమాలంటే ఎప్పుడూ అమితమైన ఆసక్తే. సరిగ్గా ఇదే పల్స్ పట్టుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్న డిఫరెంట్ అటెంప్ట్ “సీక్రెట్ సోల్జర్”. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న ఈ హై-ఓల్టేజ్ స్పై డ్రామాకి అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన టీజర్, ట్రైలర్స్ సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేశాయి. ఒక సీరియస్ స్పై థ్రిల్లర్‌కు ఎలాంటి మ్యూజిక్ ఉండాలి అనే అంచనాలను దాటుకుంటూ, తాజాగా మేకర్స్ “ఓయ్ ఓయ్..” అనే ఓ బ్యూటిఫుల్ అండ్ క్యాచీ సాంగ్‌ను రిలీజ్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశారు.
కార్తీక్ రోడ్రిగ్జ్ తనదైన స్టైల్లో ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ సమకూర్చడమే కాకుండా, స్వయంగా ఆలపించి మ్యాజిక్ చేశారు. ప్రముఖ గీత రచయిత రెహమాన్ అందించిన సాహిత్యం ఈ పాటకు మరింత ప్రాణం పోసింది. కేవలం వినడానికే కాకుండా, సినిమాలో కీలక పాత్రల మధ్య క్యూరియాసిటీని పెంచేలా ఈ పాటను చాలా రిచ్‌గా, ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఒక ఇంటెన్స్ స్పై థ్రిల్లర్‌లో ఇలాంటి ట్యూన్ రావడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై ఏమాత్రం రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్ లాంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ యూనిక్ స్పై డ్రామా.. సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!