కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రవీణ్ సత్తారుతో నాగ్ సినిమా అయిపోయింది అంటూ వస్తున్న వార్తలకు తాజా అప్డేట్ తో చెక్ పెట్టారు మేకర్స్. తాజాగా నాగ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమాకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశారు నిర్మాతలు.
అప్డేట్ ఏంటంటే… ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సెకండ్ షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ‘బంగార్రాజు’ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. ఇక మన్మధుడు నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’గా ప్రేక్షకులను మెప్పించాడు.