మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ SDT18 లో పూర్తిగా కొత్తగా మరియు యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. హనుమాన్‌తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళ భామ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తూ మాస్ యాక్షన్ లో సాగే టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాకు టైటిల్ ‘సంబరాల ఏటిగట్టు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా కోసం హీరో సాయి దుర్గ తేజ్ సిక్స్ ప్యాక్ లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యాడు. టైటిల్ టీజర్ లో శ్రీకాంత్ వాయిస్ కు సాయి లుక్ అద్భుతంగా ఉండనే చెప్పాలి. విరూపాక్ష రిలీజ్ అయి ఏడాది పైగా కావోస్తున్న మరో సినిమా రిలీజ్ చేయలేదు సాయి. ఇప్పుడు రాబోతున్న సంబరాల ఎటి గట్టు కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు ఈ హీరో. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా లుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల కానుంది.రిలీజ్ చేయనున్నారు మేకర్స్.