Save The Tigers 2: ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సినిమాలకు మాత్రమే కాదు వెబ్ సిరీస్ కి కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వీకెండ్ వచ్చేసరికి మంచి సినిమాలు ఏమున్నాయి అని వెతుకుతున్న వారి కంటే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఏమున్నాయి అని వెతుకుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇక ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ మెప్పిస్తోన్న వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 ఒక ఆసక్తికరమైన ఘనత తగ్గించుకుంది. దక్షిణాదిలోనే కాదు.. ఇండియా మొత్తంలో ఈ సిరీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలుస్తూ ఇండియాలో అన్ని ఓటీటీలలో టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ షో సత్తా చాటినట్టు టీం ప్రకటించింది. ఇండియాలోనే అన్ని ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన రీసెంట్ వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ నిలవటంపై షో రన్నర్ మహి వి.రాఘవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను ఎక్కువగా చూసి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
Also Read; Ajith: ఒళ్లు గగుర్పొడిచేలా అజిత్ కార్ యాక్సిడెంట్.. వీడియో చూశారా?
Also Read
రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదన్న ఆయన. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి మంచి విజయాలను సాధిస్తాయని దీంతో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరిందన్న ఆయన ప్రేక్షకులకు ధన్యవాదాలను తెలియజేశారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 1, సీజన్ 2 షోలకు వచ్చిన రెస్పాన్స్‌తో మరిన్ని సీజన్స్‌కు అవకాశం కల్పించినట్టే. అందులో భాగంగా సీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థ కోరుతూ ఆ ప్రకటన విడుదల చేసింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు మావుంటే సదరు రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని సంస్థ వెల్లడించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!