Rao Bahadur Teaser: టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో, వైవిధ్యమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సత్యదేవ్. ప్రస్తుతం ఆయన చాలా సెలెక్టివ్‌గా కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావు బహదూర్’ (Rao Bahadur) సినీ ప్రియుల్లో ఇప్పటికే మంచి ఆసక్తిని రేకెత్తించింది. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో, సినిమా ప్రేమికుల్లో మంచి బజ్ ఏర్పడింది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
ఈ సినిమా టీజర్‌ను ‘జస్ట్ ఏ టీజర్’ (Just a Teaser) పేరుతో జూన్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సత్యదేవ్ సరికొత్త గెటప్స్‌లో, ఎవరూ ఊహించని విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా సత్యదేవ్ ఫ్యాన్స్.. ఈసారి మనోడు పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమాను జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Meet #RaoBahadur and his MADNESS 🫡🔥#RaoBahadur 'JUST A TEASER' out on June 12th ❤️🔥
In Cinemas worldwide from 𝟑𝐫𝐝 𝐉𝐔𝐋𝐘 𝟐𝟎𝟐𝟔. #RaoBahadurOnJuly3rd @ActorSatyaDev @mahaisnotanoun @DeepaThomasss @GMBents @SrichakraasEnts @AplusSMovies @Mahayana_MP @RaoBahadurMovie… pic.twitter.com/E8Cv62Dso5
— Rao Bahadur (@RaoBahadurMovie) June 10, 2026

