Site icon NTV Telugu

హృదయాన్ని కదిలించే ‘దారే లేదా’!

నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’ విడుదలైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోను, డాక్టర్లు తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రోజునే విడుదల చేయడం పట్ల నాని ఒక్కింత బాధకు గురయ్యారు. ఈ పాట యూట్యూబ్ లింక్ ను నాని ట్వీట్ చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.
వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై ఈ మ్యూజిక్‌ వీడియోను నాని సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్‌ బిస్కెట్‌ ఈ సాంగ్‌ ఎగ్జిక్యూషన్‌ బాధ్యతలను నిర్వ‌ర్తించింది. ఇక వీడియో సాంగ్ విషయానికి వస్తే… వృత్తిరీత్యా కార్తీక్ (సత్యదేవ్‌), శ్రుతి (రూప) డాక్టర్స్. ఈ భార్యాభర్తలిద్దరూ ఒకరు మార్నింగ్ షిఫ్ట్ లో ఉంటే, మరొకరు నైట్ షిఫ్ట్ లో ఉంటారు. ఒకే హాస్పిటల్ లో కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని కలిసి చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ అదే రోజున కార్తీక్ కు కరోనా టెస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. ఒంటరిగా కేక్ కట్ చేసిన శ్రుతి, భర్తకు సేవ చేయడానికి ఇంట్లోనే ఉందామని అనుకున్నా, తనకంటే హాస్పిటల్ లో ఉన్న రోగులకే శ్రుతి అవసరం ఎక్కువ ఉందంటూ కార్తీక్ ఆమెను డ్యూటీకి పంపేస్తాడు. వీరిద్దరి అంకిత భావాన్ని గుర్తించే ఓ బాధ్యత గల పౌరుడిగా నాని ఈ మ్యూజిక్ వీడియో చివరలో మెరుపులా మెరిశాడు.
`మబ్బే కమ్మిందా.. లోకం ఆగిందా! మాతో కాదంటూ.. చూస్తూ ఉండాలా.. దారే లేదా..! గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్దం చేస్తున్న.. శ‌త్రువు దూరంగా పోనే.. పోదా..’ అంటూ కె.కె. రాసిన పాట ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కి ప‌ర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. మేకింగ్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. విజయ్‌ బులగానిన్ సంగీతం ఈ పాట‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ పాటను విడుదల చేశారు. కరోనా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ వేవ్‌ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాల‌తో పాటు తమ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్‌ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్ కు ఈ పాటను అంకితమిచ్చారు.

Exit mobile version