Site icon NTV Telugu

OTT : మరొక ఓటీటీలో విడుదల కానున్న సత్యభామ..ఎక్కడంటే..?

Untitled Design (10)

Untitled Design (10)

లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయింది కాజల్ అగర్వాల్. నాటి నుండి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల నందమూరి బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో వచ్చిన చిత్రం “సత్యభామ”. తన కెరీర్ లో 60వ సినిమాగా దర్శకుడు సుమన్ చిక్కాల దర్శకత్వంలో నటించింది. థియేటర్లలో విడుదలైన ఈ పోలీస్ యాక్షన్ డ్రామా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

కాగా కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్ అయిన 20 రోజులకు అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది సత్యభామ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జూన్ 27 తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేసింది. తాజాగా సత్యభామ మరో ఓటీటీలో విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన సత్యభామను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆయిన ఈటీవీ విన్ ఆగస్టు 1 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించింది సదురు ఓటీటీ సంస్థ. కాజల్ ముఖ్య పాత్రలో వచ్చిన సత్యభామను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు నిర్మాతలు. కాజల్ ను పోలీస్ రోల్ లో చేసే యాక్షన్ సిక్వెన్స్ ఇష్టపడేవారు ఓటీటీలోకి ఉన్న సత్యభామను చూసేయండి. ఇక ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు అలాగే శశికిరణ్ తిక్క, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి లు నిర్మాణం వహించారు.

Also Read : OTT : ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏవో తెలుసా..?

Exit mobile version