Site icon NTV Telugu

Satya : ‘రావు బహదూర్’ గా వస్తున్న సత్యదేవ్..

Sathya Dev

Sathya Dev

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో స‌త్యదేవ్ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ అర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రజంట్ హీరోగా మంచి మంచి కథలు ఎంచుకుంటున్నారు సత్యదేవ్. ‘బ్రోచేవారెవరురా’, ‘ఇస్మార్ట్ శంకర్’ , ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌తో గుర్తింపు పొంది.. తర్వాత ‘బ్లఫ్ మాస్టర్’ మూవీ తో హీరోగా మారిన సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తర్వాత ‘గుర్తుందా శీతాకాలం’, ‘తిమ్మరుసు’, ‘గాడ్సే’ వంటి మూవీస్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరగా ‘జీబ్రా’ మూవీతో అలరించిన సత్య ప్రజంట్ మరో ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు.

Also Read : Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌ పై ప్రశంసలు కురిపించిన.. హృతిక్ మాజీ భార్య

‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’, ‘ఉమామ‌హేశ్వర ఉగ్రరూప‌శ్య’ సినిమాతో ఆక‌ట్టుకొన్న ద‌ర్శకుడు వెంక‌టేష్ మ‌హా తో మూవీ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే తాజాగా మూవీ టీం ఈ ప్రాజెక్ట్‌కి ‘రావు బహదూర్’ అనే టైటిల్‌ని కరారు చేశారు. అయితే ఈ మూవీలో స‌త్యదేవ్ గెట‌ప్‌, క్యారెక్టరైజేష‌న్ మునుపెన్నడు చూడని విధ్ధంగా విచిత్రంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. దాదాపు రూ.25 కోట్లతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. స‌త్యదేవ్‌పై ఇంత పెట్టుబ‌డి పెట్టడం అంటే చిన్న విషయం కాదు. క‌థ‌ని న‌మ్మి నిర్మాత‌లు చేస్తున్న రిస్క్ అనుకోవాలి. స‌త్యదేవ్ టాలెంటెడ్ యాక్టర్‌ ఇందులో అనుమానం లేదు. త‌న‌కో క‌మ‌ర్షియ‌ల్ హిట్ అవ‌స‌రం.. అందుకే నిర్మాత రిస్క్ చేస్తున్నట్లున్నారు.

Exit mobile version