NTV Telugu Site icon

Dulquer: ఆకాశంలో ఒక తార కోసం కొత్త తారని దింపుతున్నారు!

Dulquer Salmaan

Dulquer Salmaan

మలయాళ సూపర్ స్టార్ కుమారుడైన దుల్కర్ సల్మాన్ అతి తక్కువ సమయంలోనే ప్యాన్ ఇండియా యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లక్కీ భాస్కర్, మహానటి, సీతారామం లాంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాని ఈరోజు అఫీషియల్ గా లాంచ్ చేశారు. పవన్ సాదినేని దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కొంతకాలం క్రితమే రిలీజ్ చేయగా అది సినిమా మీద ఆసక్తి పెంచింది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి.

Samantha: ఆ దర్శకుడితో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన సమంత?

అయితే ఈ సినిమా ద్వారా సాత్విక వీరవల్లి అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలుగా వ్యవహరించబోతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. ఇక ఈరోజు జరిగిన పూజా కార్యక్రమానికి నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, స్వప్న దత్ సహా సినిమా టీం పలువురు హాజరయ్యారు. ఇక హీరోయిన్ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటి అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఆమె తమిళ అమ్మాయి అనే ప్రచారం జరుగుతోంది. విదేశాల్లో చదువుకున్న ఆమెకు ఇంస్టాగ్రామ్ లో 34 వేలకు మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.