Site icon NTV Telugu

అర్జున్ దాస్ తో అందాల రాక్షసి… “ఉన్నానని” వీడియో సాంగ్

Sathya & Jen - Telugu Unnavani (The Song Cut) out now

ప్రముఖ నటుడు అర్జున్ దాస్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటించిన తమిళ వీడియో సాంగ్ తెలుగు వెర్షన్ విడుదలైంది. కొంతకాలం క్రితం రిలీజ్ అయిన “పొట్టుమ్… పొగట్టుమే” అనే ఎమోషనల్ ప్రైవేట్ వీడియో సాంగ్ తెలుగు కట్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ లవ్ సాంగ్ కు తమిళంలో మంచి స్పందన రావడంతో ఇప్పుడు తెలుగులో కూడా “ఉన్నానని” పేరుతో విడుదల చేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ ద్వారా ఈ వీడియో సాంగ్ విడుదలైంది.

Also Read : మెగాస్టార్ చిరంజీవికి ఫిలిం ఫెడరేషన్ ధన్యవాదాలు

సినిమాటోగ్రాఫర్ లియోన్ బ్రిట్టో ఈ పాటను చిత్రీకరించారు. సత్యజిత్ రవి, జెన్ మార్టిన్ ఈ సాంగ్ కు సంగీతాన్నిసమకూర్చారు. ఈ వీడియో సాంగ్‌కు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అసోసియేట్ అయిన లోగి దర్శకత్వం వహించారు. ఈ సాంగ్ లో అర్జున్ దాస్, లావణ్య త్రిపాఠిల లవ్ స్టోరీని చూపించారు. లవ్, ఎమోషన్ తో కూడుకున్న ఈ వీడియో సాంగ్ లవర్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Exit mobile version