Sarkaru Bayi: తెలంగాణ పల్లె పోరాటం.. బావి చుట్టూ తిరిగే అసలు కథ!

Sreeram Nimmala

Sreeram Nimmala

టాలీవుడ్‌లో యదార్థ సంఘటనల బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే రా అండ్ రస్టిక్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అదే దారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని మైండ్ బ్లాక్ నిజాల ఆధారంగా తెరకెక్కుతోన్న సరికొత్త పీరియడ్ డ్రామా “సర్కారు బాయి”. హీరో శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్పణలో నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. విలక్షణ దర్శకుడు లారా ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు బెస్ట్ విషెస్ చెప్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన స్పెషల్ బర్త్ డే పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన దర్శకుడు లారా.. ఈ పుట్టినరోజు పోస్టర్‌లో హీరో క్యారెక్టర్‌ను మరింత ఇంటెన్సివ్‌గా ప్రజెంట్ చేశారు. ఒక తెలంగాణ పల్లెటూరి యువకుడిగా శ్రీరామ్ నిమ్మల లుక్ ఎంతో సహజంగా, కళ్లలో ఒక కసితో కనిపిస్తోంది. అప్పటి తెలంగాణ పల్లెల్లో రాజ్యమేలిన నీటి సమస్యలు, అణగారిన వర్గాల జీవిత పోరాటాలు, సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వివక్ష వంటి అత్యంత సున్నితమైన మరియు సమాజాన్ని ఆలోచింపజేసే అంశాలను ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. ఒక నటుడిగా శ్రీరామ్ నిమ్మల కెరీర్‌లో ఈ ‘సర్కారు బాయి’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.